కరోనా వైరస్ ప్రభావం వలన అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో శ్రీ వల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం మూసివేస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. భక్తులకు కల్పించే అన్ని రకాల దర్శనాలు, పూజలు నిలిపివేస్తున్నామన్నారు. భక్తులకు ఆలయంలోకి అనుమతి ఉండదని అన్నారు. భక్తులు సహకరించవలసినదిగా ఆలయ అధికారి జి.వి.డి.యన్. లీలా కుమార్ విజ్ఞప్తి చేాశారు. ఆలయం మూసి ఉన్నప్పటికీ స్వామివారికి ప్రతిరోజు జరిపే నిత్య కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయన్నారు. ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారుల ఆదేశాల మేరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే తేదీ తెలియజేస్తామని అన్నారు.
ఇవీ చదవండి