కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి పోలీసు స్టేషన్ వద్ద శనివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వంగవీటి రాధా అనుచరులు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. కాసేపటికి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అనుచరులకు గాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించారు. అనంతరం వంగవీటి రాధా అభిమానులు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.
అంతకు ముందు హనుమాన్ జంక్షన్ వద్ద వంగవీటి రాధా, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ చౌదరి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఏలూరు వైపు నుంచి విజయవాడ వస్తున్న ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, వంగవీటి రాధా వాహనాలు ఒకరినొకరు అధిగమించే క్రమంలో వివాదం చెలరేగినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. నేతలకు పోలీసులు నచ్చజెప్పటంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసేందుకు వీరవల్లి పోలీసు స్టేషన్ వద్దకు రావటంతో మరోసారి ఘర్షణ జరిగింది.
ఇదీ చదవండి
ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, వంగవీటి రాధ వర్గీయుల వాగ్వాదం...ఎందుకంటే..!