కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కంకిపాటి నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి..సుమారు తొమ్మిది బంగారు వస్తువులు, 5 వేల నగదు అపహరించుకుపోయారు. నాగ మల్లేశ్వర కుటుంబసభ్యులంతా వేసవి కావడంతో దాబా పైన నిద్రించేందుకు ఉపక్రమించారు. ఈ క్రమంలో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి.. బీరువాలోని నగల చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేసవిలో నేరాలు జరుగుతున్నాయని పలుమార్లు మైకుల ద్వారా, సమావేశాల ద్వారా హెచ్చరికలు చేసినా పెడచెవిన పెట్టడంతో ఇటువంటి నేరాలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు.
ఇవి చదవండి....నర్సీపట్నంలో కోటి విలువ చేసే గంజాయి పట్టివేత