హైదరాబాద్లోని ఓ ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు నూజివీడు బాలికలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, నూజివీడు రూరల్ పోలీసులు కాపాడారు. నూజివీడుకు చెందిన ఇద్దరు బాలికలను వారి తల్లి ఏడాది క్రితం చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్లో చేర్పించింది. సంక్రాంతి సెలవుల తర్వాత బాలికలిద్దరూ తిరిగి రాకపోవటంపై చైల్డ్ కేర్ విచారణ చేపట్టింది. బాలికలిద్దరూ హైదరాద్లోని ఓ ఇంట్లో పని చేస్తున్నట్టు గుర్తించింది.
నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో చైల్డ్ కేర్ ఫిర్యాదు చేసింది. పోలీసులు హైదరాబాద్ వెళ్లి బాలికలను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ఇద్దరినీ విజయవాడకు చేర్చి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పరిచారు. తమ చేత అన్ని పనులూ చేయించుకునేవారని బాలికలు వెల్లడించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ వివరించారు. ఘటనపై కేసు నమోదు చేయాలని నూజివీడు రూరల్ పోలీసులకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఇదీ చదవండి: