గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రజలకు సీఎం జగన్ సందేశం ఇచ్చారు. జీసస్ మహా త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే అని ముఖ్యమంత్రి తెలిపారు. కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే అని, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన రోజు ఈస్టర్ సండే అని అన్నారు. ఈ రెండూ ఘటనలు మానవాళి చరిత్రను మలుపులు తిప్పాయని సీఎం చెప్పారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగమే జీసస్ జీవితమని... ఇదే మానవాళికి ఇచ్చిన సందేశమని వైఎస్ జగన్ తెలిపారు.
తెదేపా అధినేత చంద్రబాబు సందేశం...
క్రైస్తవులందరికీ తెదేపా అధినేత చంద్రబాబు గుడ్ ఫ్రైడే సందేశం ఇచ్చారు. ప్రేమ మహిమను మానవాళికి చాటిచెప్పిన యుగకర్త ఏసుక్రీస్తు అని కొనియాడారు.
ఇదీ చదవండి: