ETV Bharat / state

కొత్తవలస ఫలితం అవకతవకపై ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ - ఎస్​ఈసీకి చంద్రబాబు లేఖ

విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామ పంచాయతీ ఎన్నికలు 4వ దశ కౌంటింగ్​లో ఫలితం తారుమారు అయిన ఘటనపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అక్రమాలు జరిగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ
ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ
author img

By

Published : Feb 25, 2021, 8:13 PM IST

పంచాయతీ ఎన్నికలు 4వ దశ కౌంటింగ్​లో విజయనగరం జిల్లాలో ఫలితం తారుమారు అయిన ఘటనపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కొత్తవలస గ్రామపంచాయతీ పరిధిలో ఈ మేర అక్రమాలు జరిగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఓ వర్గం అధికారులు వైకాపా నేతలతో కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేశారని మండిపడ్డారు. కొంతమంది పోలీసులు ఇందుకు సహకరించటంతో వైకాపాయేతర అభ్యర్థి కష్టపడి సాధించుకున్న సర్పంచ్ గెలుపు ఫలితం తారుమారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా మద్దతుదారులకు వ్యతిరేకంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బోని తిరుపతిరావు 268 ఓట్ల మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించారని, కౌంటింగ్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి రమేష్ బాబు మాత్రం వైకాపా బలపరిచిన అభ్యర్థి రామస్వామి పది ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారని లేఖలో పేర్కొన్నారు. 19వ రౌండు వరకు 154ఓట్ల మెజారిటీతో తిరుపతిరావు ఉంటే 20వ రౌండులో మరో 114ఓట్లు మెజారిటీ సాధించినా ఫలితాన్ని తారుమారు చేశారని విమర్శించారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

ఎస్సీలపై దాడులకు రాష్ట్రం అడ్డాగా మారింది: వర్ల రామయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.