తన లేఖకు స్పందించి ఉడిపిలో చిక్కుకున్న 300కుపైగా మత్స్యకారులకు సహాయం అందించినందుకు... కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు తెదేపా అధినేత చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. వేగంగా స్పందించినందుకు భాజపా నాయకురాలు శోభకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మత్స్యకారులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఉడిపిలోని తెలుగువారికి సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇవీ చదవండి: దేశంలో కరోనా సామాజిక వ్యాప్తిపై ఐసీఎంఆర్ పరిశోధన!