రేషన్ డీలర్ల ఆత్మీయ సదస్సులో చంద్రబాబు
ఆహారభద్రతకు 4 వేల కోట్లు - meet
పేద ప్రజల ఆహారభద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్తోనే ఆహార భద్రతకు నాంది పడిందనీ... దాన్ని మేం కొనసాగిస్తున్నామని వెల్లడించారు. రేషన్ డీలర్లు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలాంటివారని తెలిపారు.
రేషన్ డీలర్ల ఆత్మీయ సదస్సులో చంద్రబాబు
పేద ప్రజల ఆహారభద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో రేషన్ డీలర్ల ఆత్మీయ సదస్సులో పాల్గొని మాట్లాడారు. రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, చక్కెర, కందిపప్పు, చిరుధాన్యాలు సరఫరా చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో రేషన్ దుకాణాలను మినీ సూపర్ మార్కెట్లుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రేషన్ డీలర్ల కమీషన్ 20 పైసల నుంచి రూపాయికి పెంచిన ఘనత తెదేపాదే అన్నారు. ఎన్టీఆర్తోనే ఆహార భద్రతకు నాంది పడిందన్నారు. ఆహార భద్రత కోసం 4 వేల కోట్లు కేటాయిస్తున్నామని వివరించారు. రేషన్ డీలర్లు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలాంటివారని తెలిపారు.
రేషన్ డీలర్ల ఆత్మీయ సదస్సులో చంద్రబాబు
Last Updated : Feb 28, 2019, 4:14 PM IST