ETV Bharat / state

'మానసాస్ ట్రస్టు యాజమాన్య వ్యవహారాల్లో జోక్యం మానుకోండి'

పద్మనాభస్వామి ఆలయ వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా.. మానసాస్ ట్రస్టు యాజమాన్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రభుత్వం మానుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. సంరక్షకులుగా గజపతి కుటుంబ హక్కులు పరిరక్షించబడాలని డిమాండ్‌ చేశారు.

chandrababu
chandrababu
author img

By

Published : Jul 14, 2020, 4:31 PM IST

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్జీ పాలిమర్స్ ఉదంతం, సాయినార్ కెమికల్స్, రాంకీ ఫార్మా సిటీలో విశాఖ సాల్వెంట్స్ లో వరుసగా దుర్ఘటనలు జరగటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునే చర్యలు తీసుకోకుండా కంపెనీలకే వైకాపా వత్తాసు పలుకుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రమాదాల నివారణపై ఏ మాత్రం దృష్టి పెట్టకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం హేయమన్నారు. తమ వైఫల్యాలకు తెదేపాపై నిందలు వేయడం వైకాపా నాయకులకు దురాలవాటుగా మారిందని మండిపడ్డారు.

గత ఏడాదిలోనే 42% అప్పులు ఏపీ పెంచిందని ఆర్బీఐ నివేదికను చంద్రబాబు సమావేశంలో ప్రస్తావించారు. విదేశీ ట్రస్ట్ నుంచి అప్పులకు అనుమతించాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని గుర్తు చేశారు. ఏడాది పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను ఎలా తలకిందులు చేశారో ఈ 2అంశాలే సాక్ష్యాలని తెలిపారు.

అవినీతికి అవకాశం ఉన్నచోటే అప్పు చేసి.. తెచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటున్నారని ఆరోపించారు. ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు, చేతివృత్తుల వారికి ప్రత్యేక ప్యాకేజి అందించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఇళ్ల స్థలాలకు భూసేకరణలో, మెరక వేయడంలో వైకాపా అవినీతిని ప్రజల్లో ఎండగట్టాలన్నారు.

శ్రీ పద్మనాభస్వామి ఆలయ వ్యవహారాలను నిర్వహించడానికి ట్రావెన్​కోర్ రాయల్ ఫ్యామిలీ హక్కులను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక మైలురాయి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశంసించారు. ట్రస్టుల నిర్వహణలో రాజ కుటుంబాల ముందస్తు ఒప్పందాలు, దీర్ఘకాల సంప్రదాయాల పవిత్రతను కోర్టు తీర్పు రక్షించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ తీర్పును గ్రహించాలని హితవుపలికారు. సింహాచలం బోర్డు, మానసాస్ ట్రస్టు యాజమాన్యంలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. సంరక్షకులుగా గజపతి కుటుంబ హక్కులు పరిరక్షించబడాలని డిమాండ్‌ చేశారు. నీతిమాలిన రాజకీయాలు ఆడటం సీఎంకు తగదన్నారు. కుటుంబం నడిపే ట్రస్టులలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని చంద్రబాబు సూచించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,916 కరోనా కేసులు.. ఒక్క రోజులోనే 43 మరణాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.