దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెరాయిన్, డ్రగ్స్ అక్రమ రవాణా కేసుపై కేంద్రం వెంటనే ప్రత్యేక విచారణ చేపట్టాలని విజయవాడ బీఆర్ టీఎస్ రోడ్డులో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సామాజిక సేవ చేస్తున్న సోనూసూద్ లాంటి వారిపై ఈడీ వంటి సంస్థలచే విచారణ జరపడానికి మోదీ ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ...ఇలాంటి అంశాల్లో ఎందుకు చూపటం లేదని ప్రశ్నించారు. దేశవాప్తంగా అంతర్గత భద్రతకు సవాల్ విసిరి, యువత భవిష్యత్తు పై తీవ్ర ప్రభావం చూపే మాదకద్రవ్యాలు అక్రమ రవాణాపై వెంటనే ఉన్నత స్ధాయిలో ప్రత్యేక దర్యాప్తు జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు డిమాండ్ చేశారు. కేంద్రం కళ్లు తెరవకుంటే పార్టీ తరుపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరెచే వరకు ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :Atchannaidu on farmers: వైకాపా పాలనలో రైతులు అప్పులపాలు: అచ్చెన్న