కృష్ణాజిల్లాలోని నందిగామ, మైలవరం, కంచికచర్ల మార్కెట్ యార్డులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించకపోవడం వల్ల రైతులకు మద్దతు ధర దక్కడంలేదు. పత్తిని గుంటూరులోని జిన్నింగ్ మిల్లు వద్దకు తీసుకువస్తేనే కొనుగోలు చేస్తామని.. స్థానికంగా యార్డుల్లో కొనమని చెప్తున్నందున అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఆయా ప్రాంతాల నుంచి గుంటూరు మిల్లు వద్దకు పత్తి తీసుకువెళ్లాలంటే రవాణా ఖర్చులు అదనంగా అవుతాయని రైతులంటున్నారు. వీటిని భరించాలంటే తమకు కష్టమవుతుందని వాపోతున్నారు. పత్తికి సీసీఐ మద్దతు ధర క్వింటాకు రూ. 5825 ఉండగా.. కేంద్రాలు ప్రారంభం కాకపోవడం వల్ల రైతులకు ఆ ధర దక్కడంలేదు. బహిరంగ మార్కెట్లో వ్యాపారులు నాణ్యతను బట్టి క్వింటా రూ. 4 వేల నుంచి రూ. 4,500 వరకు కొంటున్నారు. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గిందని.. దానికితోడు సీసీఐ మద్దతు ధర అందక మరింత నష్టపోతున్నామని రైతన్నలు వాపోతున్నారు. యార్డుల వద్ద పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి..