ప్రాంగణ ఎంపికల్లో విద్యార్థులందరికీ ఉద్యోగాలు లభించేలా చూడాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి సూచించారు. ఎంపికయ్యే సామర్థ్యం ఉన్న విద్యార్థులనే కాకుండా అందరిపై కళాశాల యాజమాన్యాలు దృష్టి సారించాలని, ఇంజినీరింగ్ మొదటి ఏడాది నుంచే పరిశ్రమలతో అనుసంధానం ఉండాలని వెల్లడించారు. విజయవాడలో వీఆర్ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల, ఏపీ శిక్షణ ఉపాధి అధికారుల సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన ‘సామర్థ్య అభివృద్ధి కార్యశాల’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హేమచంద్రారెడ్డి హజరయ్యారు.
ఉన్నత విద్య కోసం ప్రభుత్వం రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తోందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. ఉన్నత విద్య పూర్తి చేస్తున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కోసం కంపెనీలను సంప్రదిస్తున్నామని, ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌తో కూడిన కమిటీ పరిశీలిస్తోందని వెల్లడించారు.
ఇంజినీరింగ్ పాఠ్యప్రణాళికను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మార్పు చేయాలని ఎన్సీసీ మానవవనరుల విభాగం వైస్ ప్రెసిడెంట్ నారాయణరావు సూచించారు. ఈ సదస్సు ద్వారా నియామకాల్లో వస్తున్న మార్పులు తెలుసుకునే అవకాశం లభిస్తుందని, కళాశాలల్లో అవలంబిస్తున్న ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవచ్చని ఏపీ శిక్షణ ఉపాధి అధికారుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రావు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎండీగా దీవన్‌రెడ్డి నియామకం