ETV Bharat / state

కొవిడ్ నియంత్రణ చర్యలపై నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ - covid vaccination in andhrapradhesh

వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నేడు భేటీ కానుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణపై ఈ సమావేశంలో చర్చించి, అధికారులకు పలు సూచనలు చేయనున్నారు.

cabinet subcommittee met today on Kovid control measures
వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని
author img

By

Published : Apr 22, 2021, 2:27 AM IST

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ భేటీ కానుంది. వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో... ఏపీఐఐసీ భవనంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి నివారణ, పర్యవేక్షణ, వ్యాక్సినేషన్ అమలుపై కమిటీలో చర్చించి, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సరఫరా, వైద్య నిపుణుల నియామకం వంటి అంశాలపైనా మంత్రివర్గ ఉపసంఘం చర్చించనుంది. రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల్లో ఆక్సిజన్ ఉత్పత్తి, ఆస్పత్రులకు సరఫరా చేసే అంశంపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్​రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఆక్సిజన్ ఉత్పత్తికి అవసరమైన చర్యలపై పరిశ్రమల శాఖ దృష్టి సారించనుంది.

ఇదీచదవండి.

కలెక్టర్లు రంగంలోకి దిగాలి: కె.ఎస్ జవహర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.