కృష్ణా జిల్లా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇవాళ ఒక్క రోజులోనే 8 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 44కు చేరింది. వీటిలో అధికంగా విజయవాడలోనే ఉన్నాయి. భవానీపురం, కుమ్మరిపాలెం,కృష్ణలంక, రాణిగారితోట, సనత్ నగర్ , చిట్టినగర్ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు రావటంతో రెడ్ జోన్ ప్రకటించారు. మాచవరం పోలీసుస్టేషన్ పరిధిలో అనుమమానితులను కోవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్ష చేస్తున్నారు.
కేసుల పెరుగుదల నేపథ్యంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏఎన్‌ఎంలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు లాక్ డౌన్ మే3 వరకు పొడిగించటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం నమోదైన కేసుల్లో అత్యధికంగా దిల్లీ వెళ్లివచ్చిన వారివి, వారి బంధువులు, పరిచయస్తులవే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు భౌతికదూరం పాటించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: