నిరంతరం ప్రజల పక్షాన పోరాడే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు కోరారు. విజయవాడ వన్ టౌన్ లోనీ 51, 55, 56 డివిజన్లలో జరిగిన ప్రచార కార్యక్రమంలో బి.వి. రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్.బాబురావు, జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ పాల్గొన్నారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం చిన్న పరిశ్రమలను, చిరు వ్యాపారులను పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవాల్సింది పోయి.. పన్నులు, నిత్యావసరాల ధరల పెంపు వంటివాటితో సామాన్య ప్రజానీకం సతమతమయ్యేటట్లు చర్యలు చేపడుతుందన్నారు. ఇంటి వద్దకే రేషన్ అంటూ వాహనాలు పెట్టి.. జనాలను రోడ్లపై నిలబెడుతున్నారన్నారు.
ఇవీ చూడండి...