రాష్ట్రంలో గత రెండేళ్ల నుంచి బ్రాహ్మణులు ఎన్నో అవమానాలు, అణచివేత చర్యలు ఎదుర్కొంటున్నారని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాం ప్రసాద్ మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికలో ఆలోచించి ఓటు వేయాలని బ్రాహ్మణులకు బహిరంగ లేఖ రాశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో.. రాష్ట్రవ్యాప్తంగా 180 దేవాలయాలపై దాడులు జరిగాయని ఆరోపించారు. శివారు ఆలయాల్లో ధూపదీప నైవేధ్యాలు నిలిపివేశారన్నారు.
కర్నూలు జిల్లా ఓంకార దేవస్థానంలో పూజారులను చర్నాకోలుతో కొట్టిన ఘటన యావత్ బ్రాహ్మణుల మనసుల్ని గాయపరిచిందని తెలిపారు. వేలాది ఎకరాల భూములను వైకాపా నాయకులు అన్యాక్రాంతం చేశారు. కరోనా విపత్తు సమయంలోనూ బ్రాహ్మణులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బ్రాహ్మణుల పట్ల చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధిచెప్పాలని కోరారు.
ఇవీ చూడండి..