ETV Bharat / state

10మంది మధ్య తెగని పంచాయితీ... నాలుగేళ్లగా ఆగిన వంతెన... - వంతెన

ఆ వంతెన... పది గ్రామాలను కలుపుతోంది. అక్కడి ప్రజల రవాణా సౌకర్యం కల్పించడంలో ముఖ్యమైంది. పొలం పనులకు వెళ్లాలన్నా... పక్క ఊరికి వెళ్లాలన్నా... పిల్లలు చదువులకు పట్నానికి వెళ్లాలన్నా ఆ దారే దిక్కు. నిరంతరం రద్దీగా ఉండే రహదారిపై నిర్మించిన వంతెన దాటాలంటే మాత్రం గుండె ధిటవు చేసుకోవాల్సిందే. ఎక్కడ ఏ ప్రమాదంబారిన పడాల్సి వస్తుందోనని జంకుతున్నారు జనం.

వంతెన కష్టాలు
author img

By

Published : Sep 16, 2019, 7:33 AM IST

కృష్ణా జిల్లా కంకిపాడు - గుడివాడ మధ్య రహదారి నిరంతరం రద్దీగా ఉంటోంది. ఈ రహదారిలో కందేరు వద్ద రేవస్ కాలువపై వందేళ్ల క్రితం బ్రిటీష్ వారి హయాంలో వంతెన నిర్మించగా... పదేళ్ల క్రితం కూలిపోయింది. అప్పట్లో ఆ మార్గంలో ఉన్న గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో కూలిన బ్రిడ్జి పిల్లర్ల మీదే ఇనుప రాడ్లతో తాత్కాలిక వంతెన నిర్మించారు. ఈ మార్గం మీదుగా భారీ వాహనాలు వెళ్లడంతో మూడేళ్లలోనే బ్రిడ్జి దెబ్బతింది. కొన్ని చోట్ల ఇనుప రేకులు విరిగిపోగా.. మరికొన్ని తుప్పు పట్టి పెలుసుగా మారాయి. వంతెనపై పెద్ద రంద్రాలు ఏర్పడ్డాయి. ఇనుప రేకులు ఊడిపోయి ప్రమాదకరంగా పైకి లేచాయి. మరమ్మతుల లేక ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతుండగా... పాదచారులు ఇనుప చువ్వలు తగిలి గాయాల పాలవుతున్నారు. పశువులు,గొర్రెలు కాళ్లకు రంద్రాలు పడుతున్నాయి. భారీ వాహనాలు దారి మళ్లించుకుని తిరిగి వెళ్తున్నాయి.

ప్రజల వినతులతో నాలుగేళ్ల క్రితం కొత్త వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది గత ప్రభుత్వం. ఏడాది వ్యవధిలోనే పనులు 90 శాతం పూర్తయ్యాయి. చివరి పిల్లర్లపై స్లాబు వేస్తే వంతెన అందుబాటులోకి వస్తుంది. పరిహారం ఇవ్వకుండానే కొందరి ఇళ్లు కూల్చివేయడం వివాదాస్పదమైంది. సమస్య కోర్టుకెళ్లడంతో పనులు నిలిచిపోయాయి. వంతెన పూర్తైతే కష్టాలు తీరతాయని ఆశించిన పది గ్రామాల ప్రజలకు కష్టాలు తప్ప లేదు.

సమస్య ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లుచెప్పినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు చెబుతున్నారు. విత్తనాలు, ఎరువులు, ధాన్యం తరలింపులో కష్టాలు ఎదురవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
తమకు పరిహారం అందిస్తే బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్నారు గ్రామస్థులు.

10మంది మధ్య తెగని పంచాయితీ... నాలుగేళ్లగా ఆగిన వంతెన...

ఇదీ చూడండిపడవ ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు: హోంమంత్రి

Intro:ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాల ర్యాలీ

Body:ఉదయగిరి పట్టణంలో గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాల కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఆశ, అంగన్వాడి కార్యకర్తలతో పాటు గ్రామ వాలంటీర్లు పాల్గొని ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కలిగించేలా నినాదాలు చేశారు. ధూమపానం, మద్యపానం అనర్థం అంటూ ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. ప్రతి రోజు యోగా చేయండి ఇ ఆరోగ్యంగా ఉండండి అంటూ నినాదాలు చేశారు. అలాగే దీర్ఘకాల వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. ప్రజలంతా ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించాలంటే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుoదన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ పని పవన్ కుమార్, ఆరోగ్య విద్యాధికారి వెంకటసుబ్బయ్య, ఆరోగ్య పర్యవేక్షకులు షఫీ, అక్బర్ పాల్గొన్నారు.

Conclusion:రిపోర్టర్ : జి.శ్రీనివాసులు
సెల్ నెంబర్ : 8008573945

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.