కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లికి చెందిన రమేష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తూ రాత్రివేళ ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని తల్లిదండ్రులు మందలించటంతో మనస్థాపం చెందిన రమేష్ రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
తన తోటి స్నేహితుడికి 'ఐ మిస్ యూ' అని మెసేజ్ పెట్టడంతో అనుమానం వచ్చిన స్నేహితుడు.. రమేష్ తల్లిదండ్రులకి చెప్పాడు. కుమారుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎస్సై వాసిరెడ్డి బృందం కేసరపల్లి కాలువ వద్ద రమేష్ బైక్, బైక్‌లో తన మొబైల్ గుర్తించారు. మృతదేహం కోసం కేసరపల్లి కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. రమేష్ విజయవాడలోని ఓ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడని కుటుంబీకులు తెలిపారు. కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి.
ఇదీ చూడండి