వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన ప్రసాద్ అనే బాలుడు నాగార్జున సాగర్ కాలువలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. గత రెండు రోజులుగా సాగర్ జలాల నుంచి పెద్ద ఎత్తున వరద రావడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. తల్లిదండ్రుల కళ్లముందే కుమారుడు మునిగిపోతుంటే కాపాడమంటూ పెద్ద ఎత్తున కేకలు పెట్టి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సమీప పొలంలో పని చేస్తున్న రైతులు అక్కడికి చేరుకుని బాలుడిని బయటకు తీశారు. కానీ అప్పటికే బాలుడు తుది శ్వాస విడిచాడు.
ఇదీ చదవండి :