కృష్ణా జిల్లా నందిగామ అనాసాగరంలో విషాదం నెలకొంది. రోడ్డు పక్కన తీసిన గుంత ఒకటో తరగతి విద్యార్థి ప్రాణాలు బలిగొంది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి గోపిచంద్ అనే బాలుడు మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు నందిగామ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి-ఉద్యోగాల పేరుతో అమాయకులకు టోకరా..!