కరోనాకు విడాకులివ్వాలని ప్రజలంటుంటే... ముఖ్యమంత్రి జగన్ మాత్రం సహజీవనం చేద్దామంటున్నారని తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పెద్దఎత్తున ర్యాపిడ్ టెస్టులు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన 2,400 కోట్ల రూపాయల నిధులను ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. బడుగుల బియ్యం దోచేస్తున్న వైకాపా నేతలను శిక్షించాలని డిమాండ్ చేశారు. పేదలకు 5వేల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసరాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే... నిరసన దీక్షలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి