ETV Bharat / state

నల్లబెల్లం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు.. - నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు

నాటుసారా తయారీకోసం ఉపయోగించే నల్లబెల్లాన్ని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని నూజివీడు పోలీసులు అరెస్ట్​ చేశారు. సారా తయారీ కోసం ఉపయోగించే నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్​ చేశారు.

black jaggery selling person arrested
నల్లబెల్లం నిల్వలపై పోలీసుల దాడి
author img

By

Published : Mar 16, 2021, 3:50 PM IST

నాటుసారా తయారీ కోసం నల్లబెల్లాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని నూజివీడు పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్​లోని సత్యాల రాఘవరావు అనే వ్యాపారి వద్ద సుమారు 1.41 లక్షల రూపాయల విలువచేసే 2,820 కిలోల నల్లబెల్లం నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు.

నాటు సారా తయారీదారులకు నల్లబెల్లం విక్రయిస్తున్నట్లు విచారణలో వ్యాపారి రాఘవరావు ఒప్పుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. వ్యాపారి రాఘవరావును అరెస్టు చేసి.. కోర్టుకు హాజరు పరిచినట్లు డీఎస్పీ వివరించారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు, స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్​ ఆదేశానుసారం ఈ దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

వివాహిత అనుమానాస్పద మృతి.. హత్యాచారమేనని బంధువుల ఆరోపణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.