ETV Bharat / state

తెలంగాణ: హైదరాబాద్​ను భాగ్యనగరంగా మార్చాల్సిందే: బండి సంజయ్ - బండి సంజయ్ తాజా వార్తలు

హైదరాబాద్ మహానగర పాలక ఎన్నికల్లో భాజపా 48 స్థానాల్లో విజయం సాధించడంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తల నుంచి నాయకుల వరకు ఐక్యంగా పనిచేశారని అన్నారు. ఇంకా సమయం ఉండి ఉంటే 100 స్థానాలు గెలిచేవాళ్లమని ధీమా వ్యక్తం చేశారు. రేపు లేదా ఎల్లుండి పార్టీలో విజయశాంతి చేరతారని, జానారెడ్డి చేరికపై సమాచారం లేదని వెల్లడించారు.

bandi sanjay
బండి సంజయ్, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
author img

By

Published : Dec 5, 2020, 7:23 PM IST

బండి సంజయ్, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

గ్రేటర్​ ఎన్నికల్లో భాజపాకు ప్రజలు అండగా ఉండి 48 స్థానాల్లో గెలిపించడం ఆనందంగా ఉందని తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఇచ్చినా... కార్యకర్తలు అంతా ఐక్యంగా పోరాడారని వ్యాఖ్యానించారు. ఆదరాబాదరాగా ఎన్నికలు నిర్వహించి... అభ్యర్థులను ఖరారు చేసుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డదారుల్లో గెలిచేందుకు తెరాస అన్ని ప్రయత్నాలు చేసిందని విమర్శించారు. ఎన్నికల కమిషన్ తెరాస చెప్పుచేతల్లో నడిచిందని ఆరోపించారు.

విశ్వాసం పెరిగింది..

జాతీయ నాయకుల రాకతో తెలంగాణలో పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందని బండి పేర్కొన్నారు. ప్రతి ఎన్నికను భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందన్నసంజయ్​... సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం ఉపయోగపడిందన్నారు. గ్రేటర్​లో భాజపా ఓటు శాతం 10 నుంచి 35.56కు పెరిగిందని స్పష్టం చేశారు. తెరాసపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో.. భాజపాపై ఎంత విశ్వాసం ఉందో ఓట్ల శాతాలే చెబుతున్నాయన్నారు. యువతలో పార్టీకి ఆదరణ పెరిగిందన్నారు.

పిరికితనం కాదు..

చాలా స్థానాల్లో తక్కువ మెజారిటీతో ఓడిపోయాని... ఎస్​ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే మరో 25 స్థానాలు, ఎన్నికలకు తగినంత సమయం ఇచ్చి ఉంటే 100 స్థానాలు గెలిచేవాళ్లమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలని తర్వాత అభివృద్దే తమ లక్ష్యం అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్​ తీరు మార్చుకోకపోతే... ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. భాజపా కార్యకర్తల సహనాన్ని పిరికితనంగా బావించ వద్దని హితవు పలికారు.

ఎంఐఎంకు అంతలేదు..!

మంత్రుల అవినీతి, అక్రమాలు బయట పెడతామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. భాజపాపై తెరాస, ఎంఐఎం, కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. ఎంఐఎంకు భాజపాను అడ్డుకునే సామర్థ్యం లేదన్న సంజయ్... పాతబస్తీకి పరిమితమైన మజ్లిస్​ను అక్కడా లేకుండా చేస్తామని జ్యోస్యం చెప్పారు. హైదరాబాద్​ పేరు మార్పు డిమాండ్​పై తగ్గేది లేదని పునరుద్ఘాటించారు. తెరాసకు భాజపా కంటే కేవలం 9 వేల ఓట్లే ఎక్కువ వచ్చిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.

చేరికలపై..

భాజపాలో చేరికలు ఉన్నాయని బండి సంజయ్ స్పష్టం చేశారు. రేపు దిల్లీ వెళ్తున్నానని రేపు లేదా ఎల్లుండి విజయశాంతి పార్టీలో చేరతారని తెలిపారు. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కొడుకు చేరుతారా..? తండ్రి చేరతారా..? అని కాదు. ఇద్దరూ ఒకటేనని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:

ఆదాయంతోపాటు విజ్ఞానం పంచుతున్న అన్నదాత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.