గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే.. సంకల్పయాత్ర చేపట్టినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో గాంధీ సంకల్ప యాత్ర పేరుతో ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. యాత్రలోని ముఖ్య ఘట్టాలను పుస్తకంలో పొందుపరిచినట్లు భాజపా నేతలు వెల్లడించారు. జిల్లాల వారీగా సంకల్పయాత్రలో ప్రముఖ పాత్ర పోషించిన యాత్ర ప్రముఖులను కన్నా సత్కరించారు. భారతదేశాన్ని 70 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ పేరు పెట్టుకుని ఆయన ఆశయాలను మాత్రం తుంగలో తొక్కారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. సోనియా, రాహుల్ గాంధీ... వారి పేర్ల చివరన జిన్నా అని పెట్టుకుంటే సముచితంగా ఉంటుందని జీవీఎల్ దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: