ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేసి, వెంటనే చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కడప జిల్లా రాజుపాలెం మండలంలో లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందలేదని ప్రశ్నించినందుకు భాజపా నేతలపై... ఎమ్మెల్యే దాడి చేయించారని మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
గాయపడ్డ వారిని పరామర్శించిన విష్ణువర్ధన్ రెడ్డి...
నిన్న రాత్రి వైకాపా నాయకుల దాడిలో గాయపడిన నలుగురు భాజపా కార్యకర్తలను కడప రిమ్స్‌లో విష్ణువర్ధన్ రెడ్డి, పార్టీ నాయకులు పరామర్శించారు. వార్డుల్లో కేవలం నర్సులు మాత్రమే ఉన్నారని, డ్యూటీ డాక్టర్లు కనిపించడం లేదనే విషయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి రిమ్స్ సూపరింటెండెంట్‌కు ఫోన్ ద్వారా తెలియజేశారు. సరైన వైద్యం అందించకుండా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి... వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.
ఇదీ చదవండి: విశాఖ మన్యంలో లేటరైట్ తవ్వకాలపై విచారణ కమిటీ ఏర్పాటు