Somu Veerraju On Amaravathi: రాష్ట్ర రాజధాని అమరావతేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో జరిగిన సమావేశంలో శక్తి కేంద్రాల బాధ్యులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రాజ్యసభలో అమరావతిని రాజధానిగా పేర్కొందని, భాజపా వాదన కూడా అదేనని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.7200 కోట్లు రాజధాని కోసం ఖర్చు పెట్టారని.. తాము మరో రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టి రాజధానిని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
భాజపా అధికారంలోకి వస్తే.. ఉద్యోగులకు పీఆర్సీనే కాకుండా, స్వయంప్రతిపత్తిని కల్పిస్తామని సోము వీర్రాజు అన్నారు. రాజకీయ పార్టీలు ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటాయని, ఉద్యోగులు 40 ఏళ్లు ఉంటారని చెప్పారు. ఉద్యోగులకు స్వయంప్రతిపత్తి ఇవ్వడం వల్ల ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందని, అభివృద్ధి త్వరగా జరుగుతుందన్నారు.
ఇదీ చదవండి
AP Employees Steering Committee: 'సమ్మెలోకి వెళ్తే.. జీతాలు మిగుల్చుకుందామని ప్రభుత్వం కుట్ర'