చిల్లకల్లులో టిప్పర్, బైకు ఢీ.. ఒకరికి గాయాలు - చిల్లకల్లులో రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో బైకును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు అదే గ్రామానికి చెందిన కారు డ్రైవర్ అబ్దుల్ బాషాగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుడిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.