ఉగాది రోజు నుంచి జూలై 31 వరకు.. దేశవ్యాప్త భూమి సుపోషణ్ అభయాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. విజయవాడలో రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడవల్లి వెంకటేశ్వరరావు, భూమి సుపోషణ్ అభయాన్ కమిటీ అధ్యక్షుడు, భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమార స్వామి ఈ మేరకు వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం మొదటి దశలో జిల్లా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా అనుభవం ఉన్న రైతులతో భూసారం పెంపుపై మెళకువలు వివరిస్తామన్నారు. రైతులు భూ సారాన్ని పెంచుకోటంలో ఉన్న ప్రయోజనాన్ని.. రసాయనిక ఎరువుల వాడకంతో ఏర్పడే దుష్ప్రభావాల నుంచి భూమిని కాపాడుకోటంపై రైతులకు కావలసిన సలహాలు, శిక్షణ అందిస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్య క్రమాలను నిర్వహిస్తామన్న వారు.. విజయవాడలో తాడిగడపలో మేడసాని విజయ భాస్కర్ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులంతా ఉపయోగించుకోవాలని కోరారు.
ఇవీ చూడండి..