విజయవాడ ఇంద్రకీలాద్రిపై సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తుంది. మాఘ శుద్ధ పంచమి సందర్భంగా అంతరాలయం సహా ఉత్సవమూర్తికి అలంకరించారు. యాగశాలలో సరస్వతి యాగం, సరస్వతి మంత్ర హవనం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో సురేష్‌బాబు, వైదిక కమిటీ, వేదపండితులు పాల్గొన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న విద్యార్థులకు కలం, అమ్మవారి ఫొటో పంపిణీ చేశారు. విద్యార్థులకు రక్షాకంకణం, కుంకుమ, ప్రసాదం అందించారు.
ఇదీ చదవండి: తొలుత 12 పట్టణాల్లో మధ్య తరగతికి తక్కువ ధరలకే ఇళ్ల స్థలాలు : సీఎం జగన్