గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్ళన్ని... తాను అధికారంలోకి వస్తే ఉచితంగా ఇస్తానన్న హామీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ ధర్నా చౌక్‌లో 'నా ఇల్లు నా హక్కు' అంటూ లబ్దిదారులు ధర్నాకు దిగారు. తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా... విజయవాడ ధర్నా చౌక్‌లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా ఉమా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైకాపా అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా.... రాష్ట్రంలో ఒక్క నిర్మాణం కూడా చేపట్టక పోగా గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా వేధిస్తున్నారని తెదేపా నాయకులు మండిపడ్డారు. వచ్చే సంక్రాంతి నాటికి తెదేపా నిర్మించిన ఇళ్లన్నీఇవ్వాలని లేదంటే లబ్ధిదారులతో వాటిని ప్రారంభింపచేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: కార్మికుల సంక్షేమ బోర్డు కోసం తహసీల్దారుకు వినతి