సీదిరి అప్పలరాజును తక్షణం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని పలువురు బీసీ నాయకులు డిమాండ్ చేశారు. గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో లచ్చన్న విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
మంత్రి తీరుపై మాజీ ఎంపీ, తెదేపా నాయకులు కొనకళ్ల నారాయణరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం దక్కించుకున్నాక కళ్లు నెత్తికెక్కినట్లు వ్యవహరించటం సమంజసం కాదని హితవు పలికారు. బీసీలకు సమాజంలో తగు గౌరవం కల్పించడంతోపాటు రాజ్యాధికారం కల్పించే విషయంలో కీలక పాత్ర పోషించిన గౌతు లచ్చన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రంలో మంత్రి పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఇదీచదవండి