కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభా గణనలో బీసీ కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం జాతీయ స్థాయి ఉద్యమం చేయనున్నట్లు ప్రకటించారు. విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి.. ఈ మేరకు తీర్మానాలు చేయడం సహా... పోరాట కార్యాచరణ రూపొందించారు. కులగణన విషయంలో భాజపా వైఖరి స్పష్టం చేయాలన్నారు.
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఇప్పటికే పార్లమెంట్లో వైకాపా బిల్లు పెట్టిందని పలు పార్టీలు మద్దతిచ్చాయని ఆర్. కృష్ణయ్య తెలిపారు. బిల్లును ఆమోదించేందుకు భాజపా సహా అన్ని పార్టీలు ముందుకు రావాలన్నారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, దీనికోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.