బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 28న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రైతు సంఘం, బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. విజయవాడ దాసరి భవన్లో జరిగిన సమావేశంలో వివిధ సంఘాలు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి రైతులు, కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు అధిక సంఖ్యలో ఛలో విజయవాడకు తరలి రానున్నారని భారతీయ కిసాన్ సంఘం ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య విజయవాడలో తెలిపారు. ప్రధాని మోదీ కార్పోరేట్ సంస్థలకు లబ్ధి చేకుర్చేందుకే బ్యాంకులను విలీనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రాబ్యాంకు విలీనంతో ప్రధాన కార్యాలయం ముంబయికి తరలిపోతుందని... ఫలితంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
ఇదీ చూడండి:
నేరేడ్ బ్యారేజీపై.. ఒడిశా పిటిషన్ కొట్టేసిన వంశధార ట్రైబ్యునల్