Ayodhya Sri Sitaramachandra Swamy Footsteps : అయోధ్య శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పాదుకలు కాకినాడ జిల్లా తాళ్లరేవు రంగనాయకపురం కోదండ రామాలయానికి చేరాయి. ఈ సందర్భంగా స్వామి వారి పాదుకలకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం జరిపించారు. ఈ సందర్భంగా గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్థులంతా జైశ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. పూజల్లో పాల్గొనేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పాదులను పల్లకీలో ఊరేగించగా.. ఆ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రజలు పోటీపడడం విశేషం. అనంతరం.. పాదుకల దాత చల్లా శ్రీనివాస శాస్త్రి, గాయత్రి దంపతులను గ్రామస్థులు ఘనంగా సత్కరించారు.
Ayodhya Ram Mandir Replica : కలపతో అయోధ్య రామమందిర నమూనా.. దీపావళికి కానుకగా..
కాకినాడ జిల్లా తాళ్లరేవు రంగనాయకపురం కోదండ రామాలయంలో అయోధ్య శ్రీరాముడి పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించి క్షీరాభిషేకం చేశారు. మంతెన కుమార్ కృష్ణ వర్మ, మంతెన భువనేశ్వరి ఆధ్వర్యంలో అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ చైర్మన్ చల్లా శ్రీనివాస శాస్త్రి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. జైశ్రీరామ్ అంటూ భక్త జనం నినదించారు. అయోధ్యలో రామ మందిరం రూపుదిద్దుకుంటున్న వేళ... భరతుడి హయాంలో రాజ్యాన్ని నడిపించిన శ్రీరామ పాదుకల స్ఫూర్తితో.. బంగారు పూతతో కూడిన తొమ్మిది కిలోల వెండితో చేసిన పాదుకలు సమర్పించబోతున్నారు.
దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నింటిలో పూజలందుకున్న ఆ పాదుకలను 10 మందితో పాదయాత్రగా వెళ్లి స్వామికి అర్పించనున్నారు. ఈ నెల 28న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో పాదయాత్ర ప్రారంభించి సంక్రాంతి రోజున అయోధ్య ఆలయ కమిటీకి పాదుకలు అందించనున్నారు. శ్రీరామ పాదుకలను దర్శించుకునేందుకు రంగనాయకపురానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీరాముడి పాదుకులను పల్లకీలో ఊరేగించారు. చల్లా శ్రీనివాస శాస్త్రి, గాయత్రి దంపతులను గ్రామస్థులు సత్కరించారు.
అక్టోబర్ 28 నుంచి జనవరి 15వరకు పాదయాత్రగా వెదురుపాక, రాజమండ్రి, భద్రాచలం, నాగ్పూర్ మీదుగా.. చిత్రకూట్, ప్రయాగరాజ్, అయోధ్య చేరుకుంటాం. రాముల వారు వచ్చిన మార్గంలోనే మేము కూడా పాదయాత్ర చేపడుతున్నాం. మొత్తం 8కిలోల వెండితో తయారు చేసిన ఈ రామ పాదుకలకు కిలో బంగారం తొడుగు చేయించాం. దీంతో పాటు ఆరున్నర అడుగుల ధనుస్సును దాదాపు 20 కిలోల వెండితో చేయిస్తున్నాం. - చల్లా శ్రీనివాస శాస్త్రి
శ్రీరంగనాయకపురానికి రాములవారి పాదుకలు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రాముడి బాటలో ధర్మబద్ధంగా నడిస్తే ఏదైనా సాధ్యమేనని పూర్తిగా విశ్వసిస్తున్నాం. - భువనేశ్వరి వర్మ
ఏదైనా ఆచరణలో ఉంటేతప్పకుండా మనకు శుభం కలుగుతుంది. ఈ గ్రామ ప్రజలంతా ధర్మరక్షణకు పాటుపడాలి. సాక్షాత్తూ ఆ రామచంద్రమూర్తే మనకు పాదుకలు పంపించారని భావిస్తున్నాం. - ఉంగరాల వెంకటేశ్వరరావు
Ayodhya Ram Mandir Maha Yantram: అయోధ్య రామాలయ మహాయంత్రం గుంటూరు జిల్లాలో తయారీ