మహిళా చోదకులకు విజయవాడలో కారు డ్రైవింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కారు ఎలా నడపాలి, కారులోని ఏయే విభాగాలపై పట్టుండాలి, అలైన్మెంట్లో తేడా వస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి, బ్రేక్ వేసినప్పుడు టైరు ఏ విధంగా ఆగుతుంది.. ఇలా అనేక అంశాలపై మహిళలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం షోరూంలోని కార్యశాలలో కారులోని అన్ని విభాగాలను పరిచయం చేస్తూ వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా తమకు అనేక మెళకువలు తెలిశాయని మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి తరచూ నిర్వహిస్తుంటే ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. దూర ప్రయాణాలు చేసినప్పుడు ఇబ్బందులు తలెత్తితే అక్కడికక్కడే పరిష్కరించుకునే విధంగా మెళకువలు నేర్పించడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..