వాహనమిత్ర ద్వారా రూ.10 వేల ఆర్థిక సహాయం చేసినందుకు కృతజ్ఞతగా.. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆటోడ్రైవర్లు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సహాయం డ్రైవర్ల కుటుంబాలకు ఆసరాగా ఉంటుందని ఎమ్మెల్యే సింహాద్రి అన్నారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే 90 శాతం హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావుతో పాటు పలువురు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి..