కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో గ్రామ సచివాలయం కోసం... పేదల నిర్మించుకున్న ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వానికి చెందిన భూమిలో సచివాలయ నిర్మించ తలపెట్టిన అధికారులు...అక్కడ కొన్నేళ్లుగా నివాసముంటున్న పేదల గృహాలను స్థానిక నేతలతో కలిసి జేసీబీతో కూల్చి వేశారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా.. తాము నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం దారుణమని బాధితులు అధికారులపై మండిపడ్డారు. రెక్కాడితే గాని డొక్కాడని తమని కట్టుబట్టలతో రొడ్డుపై పడవేశారని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇవీ చదవండి: భూములిచ్చింది రాజధాని కోసం... రాజకీయాల కోసంకాదు