కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆశా వర్కర్లను కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర ఆశా వర్కర్స్ యూనియన్ ధర్నా చేపట్టింది. విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రతి 1000 నుంచి 1500 జనాభాకు ఒక ఆశా వర్కర్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలకు ఒకరిని నియమించటం సరైంది కాదన్నారు. అంతమంది జనాభాకు ఒకరే పని చేయలేరని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు అందేలా చూడాలని ఆశా వర్కర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమల కోరారు. పదవీ విరమణ అనంతరం అందాల్సిన ప్రయోజనాలు ఇచ్చిన తర్వాతే వారిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. లేకుంటే.. నవంబర్ 2న అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడికి ఆశా వర్కర్లకు పిలుపునిస్తున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: