ETV Bharat / state

ఆశావర్కర్ల 'ఛలో విజయవాడ'..జీతాలు చెల్లించాలని డిమాండ్​

author img

By

Published : Aug 26, 2019, 4:28 PM IST

ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్ల 'ఛలో విజయవాడ' కార్యక్రమం చేపట్టారు. 8 నెలలుగా రావాల్సిన జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. పలుచోట్ల ఆశావర్కర్ల అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

darna
ఆశావర్కర్ల 'ఛలో విజయవాడ'-జీతాలు చెల్లించాలని డిమాండ్

ఎనిమిది నెలలుగా తమకు రావాల్సిన జీతాలను తక్షణమే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్లు 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారంలోకి వచ్చాక ప్రకటించిన పది వేల రూపాయల వేతనాన్ని తక్షణమే అమలు చేయాలని, వేతనం అమలులో ఏ, బీ, సీ కేటగిరీలు లేకుండా అందరికీ సమానంగా 10 వేల వేతనం ఇవ్వాలని విజయవాడలో డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం 'ఛలో విజయవాడ' కార్యక్రమం చేపడితే ముందుగానే గృహ నిర్బంధం చేయడం ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు.

కడప కలెక్టరేట్ ఎదుట ఆశావర్కర్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పోలీస్ స్టేషన్‌లో ఆశా వర్కర్లతో కలిసి ఎమ్మెల్యే రామానాయుడు ధర్నా నిర్వహించారు. అరెస్ట్‌ చేసిన ఆశావర్కర్లను వెంటనే ఇంటికి పంపాలని డిమాండ్ చేశారు.

Intro:FILE NAME : AP_ONG_43_26_PADI_RAITULA_ANDOLANA_AVB_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA (PRAKASAM)

యాంకర్ వాయిస్ : పాడిరైతుల ఇబ్బందులు తొలగించేందుకు పశువులకు ఎండా, వాన నుండి రక్షణ కలిపించేందుకు ప్రవేశపెట్టిన మినీ గోకులాల పధకం అమలుపై నీలినీడలు అలముకున్నాయి... గ్రామీణ ప్రాంతాల్లోని పశుపోషకులకు ఊతం ఇచ్చే విధంగా కేంద్రప్రభుత్వం ఉపాదిహామీ పథకం ద్వారా మినీ గోకులాల పథకానికి రూపకల్పన చేసింది... యూనిట్ విలువలో పదిశాతం పశుపోషకులు చెల్లిస్తే.. .మిగిలిన 90 శాతం ఉపాది హామీ నిధులుద్వారా చెల్లించి పశువులకు, గొర్రెలకు షెడ్లు నిర్మించాల్సి ఉంటుంది.... దీంతో ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని గ్రామాల్లో సుమారు 500 మంది లబ్ధిదారుల వాటగా 27 వేల రెండు వందల రూపాయలు డిడి రూపంలో పశువైద్యశాఖ అధికారులకు అందచేశారు... పధకం అమలవుతుందని ఆశతో ఉన్న పోషకులకు నిరాశే మిగలటంతో తాము కట్టిన డీడీలు తమకు తిరిగి ఇవ్వవలసిందిగా అధికారులను కోరగా.. తమను కార్యాలయానికి తిప్పుతున్నారని పశుపోషకులు ఆవేదనచెందుతున్నారు.. ఈ నేపథ్యంలో సోమవారం స్పందన కార్యక్రమంలో చీరాల తహసిల్దార్ కు వినతిపత్రం అందచేశారు.. ఇప్పటికైనా స్పందించి తాము కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలసిందిగా కోరుతున్నారు.

Body:బైట్ : 1 : జి.కుమార్ - పశుపోషకులు,గవినివారిపాలెం.
బైట్ : 2 : సోమయ్య, పశుపోషకుడు,గవినివారిపాలెం.

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.