ETV Bharat / state

ముక్కోటి ఏకాదశి వేడుక కోసం అందం ముస్తాబౌతున్న ఆలయాలు

author img

By

Published : Dec 24, 2020, 6:01 PM IST

రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విష్ణు ఆలయాలన్ని వైకుంఠ ద్వారదర్శనంకు ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, చలువ పందిళ్లలను ఏర్పాట్లు చేశారు. అలాగే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ఆలయ కమిటీలు చర్యలు చేపట్టాయి.

Vaikuntha Dwaradarshan
ముక్కోటి ఏకాదశి వేడుక కోసం అందం ముస్తాబౌతున్న ఆలయాలు

రాష్ట్ర వ్యాప్తంగా విష్ణు ఆలయాలన్ని వైకుంఠ ద్వారదర్శన ఏర్పాట్లతో ముస్తాబయ్యాయి. రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీ మహా విష్ణువును దర్శించుకోని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

నెల్లూరు..

ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని వైకుంఠ ద్వారదర్శనానికి ముస్తాబైంది. రేపు 50వేల మందికి భక్తులు స్వామివారి దర్శంచుకునే వీలు ఉండగా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్లు, చలువ పందిళ్లలను ఏర్పాట్లు చేశారు. భక్తులు కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. స్వామి వారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు, పాలకులు కోరారు.

విశాఖ

విశాఖ సింహాచలంలో రేపు జరగనున్న ముక్కోటి ఏకాదశి వేడుకకు ... సింహగిరిపై వైకుంఠద్వార దర్శనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 25న వేకువజామున ఒంటి గంటకు స్వామిని అర్చకులు సుప్రభాతసేవతో మేల్కొలిపి అనంతరం ఆరాధన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ ఉత్తర ద్వారంలో దేవస్థానం ధర్మకర్త దర్శనం చేసుకుంటారు. అనంతరం భక్తులకు 5:30 నుండి మొదలవుతాయని ఉదయం 10 గంటల వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు అంతరాలయంలో దర్శనాలు ఉంటాయని పేర్కోన్నారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో జరగాల్సిన ఆర్జిత సేవలను రద్దు చేశారు . భక్తుల దర్శనార్థం ఉచిత దర్శనం తో పాటు వంద రూపాయలు 300 రూపాయల టిక్కెట్లు సింహగిరిపై భక్తులు తీసుకొని దర్శనానికి వెళ్లొచ్చు అని అధికారులు తెలిపారు . అలాగే రేపు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపునుందని ఆలయ వర్గాలు సమాచారం అందించారు.

తూర్పుగోదావరి..

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ఆత్రేయపురంలోని అభయఆంజనేయ స్వామి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా స్వామి దర్శనం కల్పించేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే భక్తలు కొవిడ్​ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నామని ఆలయ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండీ...వైకుంఠ ఏకాదశి దర్శనం: వీఐపీలకు తితిదే ప్రత్యేక ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.