ETV Bharat / state

అచ్చెన్న బెయిల్ పిటిషన్​పై ముగిసిన వాదనలు... తీర్పు రిజర్వు - Achchena bail petition latest news updates

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం... వచ్చే శుక్రవారం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.

Arguments concluded in the case of Achchena bail petition in high court
అచ్చెన్న బెయిల్ పిటిషన్ కేసులో ముగిసిన వాదనలు
author img

By

Published : Aug 25, 2020, 5:42 PM IST

మాజీమంత్రి అచ్చెన్నాయుడు.. హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​పై ఇవాళ విచారణ జరిగింది. అచ్చెన్నాయుడు నుంచి ఇప్పటికే.. ఏసీబీ అధికారులు సమాచారం తీసుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. కరోనాతో ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. దర్యాప్తు కొనసాగుతున్నందున ఈ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్​లో ఉంచింది. వచ్చే శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

మరోవైపు ఈఎస్ఐ ఔషధాల కొనుగోలు కేసులో నిందితుడైన అశ్విన్ బెయిల్ వ్యాజ్యంపై జరిగిన వాదనలో బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.

ఇదీచదవండి

నిండుకుండను తలపిస్తున్న పులిచింతల జలాశయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.