ETV Bharat / state

పంచారామాల సందర్శన కోసం 300 ప్రత్యేక బస్సులు

author img

By

Published : Nov 3, 2021, 9:25 AM IST

కార్తీకమాసాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీఎస్​ ఆర్టీసీ నిర్ణయించింది. మొత్తం 15 డిపోల పరిధిలో 300 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

apsrtc-run-special-busses-for-karthika-masam-in-krishna-district
పంచారామల సందర్శన కోసం 300 ప్రత్యేక బస్సులు
పంచారామాల సందర్శన కోసం 300 ప్రత్యేక బస్సులు

కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రంలో పంచారామ క్షేత్రాలను సందర్శించుకునే అవకాశాన్ని ఏపీఎస్ ఆర్టీసీ కల్పించింది. భక్తుల కోసం జిల్లా కేంద్రాల నుంచి ఆయా క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. కృష్ణా జిల్లాలోని విజయవాడ సహా 14 డిపోల పరిధిలో 300 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నవంబర్ 6 నుంచి నెలాఖరు వరకు పలు రోజ్లుల్లో బస్సులు బయలుదేరతాయి. పంచారామక్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలను ఒకేరోజు దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం, సహా ముఖ్యమైన రోజుల్లో పండిట్ నెహ్రూ బస్టాండు నుంచి ఉదయం 4 గంటలకు బస్సులు బయలుదేరి తిరిగి అదేరోజు రాత్రికి తిరిగి విజయవాడ చేరుకుంటాయని కృష్ణా జిల్లా రీజినల్ మేనేజర్ ఎం. వై దానం తెలిపారు. కృష్ణా జిల్లాలోని పలు పట్టణాల నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

వీటితోపాటు త్రిలింగ దర్శిని కార్యక్రమంలో భాగంగా యాగంటి, మహానంది, శ్రీశైలం క్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు కృష్ణా జిల్లా రీజినల్ మేనేజర్ వెల్లడించారు. వెళ్లాలనుకునే భక్తులు సమీపంలోని ఆర్టీసీ బస్టాండు, లేదా టికెట్ కౌంటర్, బుకింగ్ ఏజెంట్లు లేదా డిపో మేనేజర్​ను సంప్రదించి టికెట్లు పొందవచ్చని తెలిపారు. 9959225475 నెంబర్ కు ఫోన్​లో సంప్రదిస్తే బస్సులు ఏర్పాటు చేస్తామని వివరించారు.

ఇదీ చూడండి:

మొక్కవోని దీక్షతో ముందుకెళ్తున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.