ETV Bharat / state

'యంగ్ సైంటిస్ట్ ఇండియా కాంపిటీషన్' ప్రారంభం.. - యంగ్ సైంటిస్ట్ ఇండియా కాంపిటీషన్​కు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్​లోని బిట్స్ పిలానీ ఏడో విడత 'యంగ్ సైంటిస్ట్ ఇండియా కాంపిటీషన్'ను ప్రకటించింది. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్​ వరకు విద్యార్థులను యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపింది.

applications-invited-for-young-scientist-india-compitetions
'యంగ్ సైంటిస్ట్ ఇండియా కాంపిటీషన్' ప్రారంభం..
author img

By

Published : Nov 5, 2020, 12:24 PM IST

Updated : Nov 5, 2020, 1:21 PM IST

ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులను యువ శాస్ర్తవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నిర్వహించే జాతీయ స్థాయి 'యంగ్ సైంటిస్ట్ ఇండియా కాంపిటీషన్' ఏడో విడతను బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్​లోని టెక్నాలజీ బిజినెస్ ఇంక్యూబేటర్(టీబీఐ) ప్రకటించింది. దీనికోసం స్పేస్ కిడ్స్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం ద్వారా అధునాతన ల్యాబ్​లలో విద్యార్థులు పనిచేసి, అంతర్జాతీయంగా ప్రతిభను ప్రదర్శించుకోవచ్చని టీబీఐ తెలిపింది.

స్పేస్ కిడ్స్ ఇప్పటికే 12 బెలూన్ సాటిలైట్స్, 3 సబ్ ఆర్బిటల్ శాటిలైట్స్, 1 ఆర్బిటల్ శాటిలైట్ ప్రయోగించినట్లు వెల్లడించింది. నీతి ఆయోగ్, హెక్జా వేర్ ఈ కాంపిటీషన్​కు మద్దతివ్వటం సంతోషకరమని స్పెస్ కిడ్స్ వ్యవస్థాపకులు తెలిపారు. 15 డిసెంబర్ వరకు స్పేస్ కిడ్స్ వెబ్​సైట్​లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని టీబీఐ ప్రకటించింది.

ఇదీ చూడండి: 'ఆగస్టు కల్లా 25 కోట్ల మందికి కొవిడ్​ టీకా'

Last Updated : Nov 5, 2020, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.