ETV Bharat / state

"పారిశ్రామిక ప్రగతే లక్ష్యంగా.. ఏపీఐఐసీ నూతన సంస్కరణలు" - APIIC Chairman Visit jaggaiahpet auto nagar

APIIC Chairman Govinda Reddy Visit Jaggayyapeta AutoNagar: కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఆటోనగర్​లో ఏపీఐఐసీ ఛైర్మన్​ గోవింద రెడ్డి పర్యటించారు. పారిశ్రామిక యూనిట్లకు అనుకూలంగా "కో-ఆర్డినేటెడ్ గ్రోత్" పాలసీ అమలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

APIIC CHAIRMAN GOVINDA REDDY
ఏపీఐఐసీ ఛైర్మన్​ మెట్టు గోవింద రెడ్డి
author img

By

Published : Mar 30, 2022, 4:24 PM IST

APIIC Chairman Visit: పరిశ్రమలు, పారిశ్రామిక ప్రగతే లక్ష్యంగా.. ఏపీఐఐసీ కొత్త సంస్కరణలు, నిర్ణయాలు ఉంటాయని ఆ సంస్థ ఛైర్మన్​ గోవింద రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరర్ధకంగా మారిన పారిశ్రామిక యూనిట్లను నడిపించేందుకు వీలుగా కో-ఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీ అమలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఆటోనగర్​లో.. గోవింద రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు పారిశ్రామిక యూనిట్లను పరిశీలించారు.

'ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వాడలు, ఆటోనగర్​లను ఆనుకొని నివాసప్రాంతాలు వచ్చేశాయి. దీని వల్ల పారిశ్రామిక యూనిట్లు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతోపాటు ప్రాధాన్యతలు, పరిస్థితులు మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఆటోనగర్లలోని పారిశ్రమిక యూనిట్లకు చెందిన భూములు.. నివాస, వాణిజ్య అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో ఉత్పత్తి నిలిపివేసిన యూనిట్లను కూడా పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం' అని ఏపీఐఐసీ ఛైర్మన్​ గోవిందరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: New districts: కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.