ఏపీ నుంచి వెళ్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు వెనక్కి పంపుతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి తక్షణం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన వినోద అనే వృద్ధురాలికి పక్షవాతం వచ్చిందన్న నారాయణ.. హైదరాబాద్‌లోని ఆస్పత్రి పత్రం చూపినా తెలంగాణ పోలీసులు అనుమతించడం లేదని విమర్శించారు. పరిస్థితి విషమంగా ఉంటే ఆంక్షలేంటని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఖాళీ అంబులెన్స్‌లను కూడా తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారని, పేషెంట్లను వదిలివస్తున్న అంబులెన్స్‌లను నిలిపివేయడంపై డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఇదీ చదవండి: ఏపీ తెలంగాణ బోర్డర్ : మరోసారి అంబులెన్సులను నిలిపేసిన తెలంగాణ పోలీసులు
అంబులెన్స్‌లను ఆపడం అమానుషం : సీపీఐ నారాయణ - ap news latest
ఏపీ నుంచి వెళ్తున్న అంబులెన్స్‌లను ఆపడం అమానుషమని.. తెలంగాణ ముఖ్యమంత్రి తక్షణం సానుకూలంగా స్పందించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. రామాపురం క్రాస్‌రోడ్ వద్ద అంబులెన్స్‌లు నిలిచిపోయాయన్నారు.
![అంబులెన్స్‌లను ఆపడం అమానుషం : సీపీఐ నారాయణ narayana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11755507-92-11755507-1620977725079.jpg?imwidth=3840)