- ప్రభుత్వం పిల్లిమొగ్గలు.. సీపీఎస్‌పై సీఎం హామీని నిలబెట్టకోవాలంటున్న ఉద్యోగులు
Government employee unions: ఓపీఎస్ పై స్పష్టమైన హామీ లేని ప్రభుత్వంతో చర్చలకు హాజరుకాబోమని వివిధ ఉద్యోగ సంఘాలు తేల్చిచెప్పడంతో.. ప్రభుత్వం పిల్లిమొగ్గ వేసింది. సీపీఎస్‌పై ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఉద్యోగుల సమస్యలపై చర్చించింది. సమాచార లోపంతోనే అలా జరిగిందని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలకు నిర్దేశిత గడువు విధించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
- దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు.. వైసీపీలో కలకలం
Devineni Avinash: విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు రాత్రి వరకూ కొనసాగాయి. ఆయన ఇంట్లోకి ఎవరినీ రానివ్వకుండా సీఆర్పీఎఫ్ బలగాలను గేటువద్ద కాపాల ఉంచి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ భూమికి సంబంధించిన వంశీరామ్ బిల్డర్స్‌తో ఒప్పందం నేపథ్యంలో సోదాలు కొనసాగినట్లు తెలుస్తోంది.
- తపస్వి ప్రేమ వాస్తవాలు గుర్తించలేని గుడ్డిది.. జ్ఞానేశ్వర్ ప్రేమ చెడ్డది
ప్రేమ గుడ్డిది అనే నానుడి నిజమని.. ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన బీడీఎస్ విద్యార్థి తపస్వి హత్యోదంతం మరోమారు నిరూపించింది. కన్నవారు దూరంగా ఎక్కడో ఉద్యోగం చేస్తున్నా, తన కలల్ని సాకారం చేసుకునేందుకు ఆమె ఒంటరిగా ఉండి చదువుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడి ప్రేమ నిజమని నమ్మింది. తన ప్రేమతో పాటు నగలు, డబ్బు ఇచ్చింది. చివరకూ ఆ జులాయి చేతిలోనే హతమైంది.
- కేంద్రం షాక్.. రూ.982కోట్లు వెనక్కి.. రాష్ట్ర ఆర్థికశాఖ మల్లగుల్లాలు
GST funds of Rs.982 crores: ఆర్థిక కష్ట్రాలతో అతలాకుతలం అవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. ఇటీవలే జీఎస్టీ వాటాగా ఇచ్చిన నిధులతో పాటు వివిధ హెడ్ల కింద మంజూరు చేసిన 982 కోట్ల రూపాయలను పాత బకాయిల కింద.. వెనక్కు తీసేసుకుంది. అసలే జీతాలు, పింఛన్లు చెల్లించలేని దుస్థితిలో ఉన్న రాష్ట్రప్రభుత్వం..కేంద్రం నిర్ణయంతో తలలు పట్టుకుంటోంది. జీతాలు పింఛన్లు ఎలా చెల్లించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది.
- ఐసీఎంఆర్ డేటాబేస్‌పై సైబర్ దాడి.. ఒక్కరోజులోనే ఏకంగా 6,000 సార్లు..
ఎయిమ్స్ డేటాబేస్‌పై సైబర్ దాడి తర్వాత హ్యాకర్స్ ఐసీఎంఆర్ సర్వర్‌ను కూడా హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారట. ఈ మేరకు ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లోని డేటాబేస్‌పై సైబర్ దాడికి యత్నించిన వివరాలకు సంబంధించిన నివేదికను ఎన్ఐసీ విడుదల చేసింది.
- హిందూ సంప్రదాయంలో ఇటాలియన్ జంట పెళ్లి.. తాజ్‌మహల్ వేదికగా..
ఇటలీకి చెందిన ఓ జంట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి తాజ్‌మహల్ సమీపంలోని ఓ రిసార్ట్ వేదికైంది.
- క్లిష్ట పరిస్థితుల్లో టీమ్ఇండియా.. ఎటు పోతోంది మన క్రికెట్?
గత కొంతకాలంగా చూస్తే టీమ్ఇండియాకు ఏమవుతుందో అస్సలు అర్థం కావట్లేదు. వారి ఆటతీరు రోజురోజుకు డీలా పడుతోంది. చిన్న జట్లుపైనా కూడా పేలవ ప్రదర్శన చేస్తూ విమర్శల పాలవుతోంది. దాని గురించే ఈ కథనం..
- ఆసియా దానకర్ణుడు అదానీయే.. ఏటా 37 లక్షల మందికి సాయం!.. ఫోర్బ్స్ జాబితాలో చోటు
ఆసియాలో దాతృత్వంలో ముందున్న వారిలో భారత కుబేరుడు గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నారు. మంగళవారం ఫోర్బ్స్ విడుదల చేసిన ‘ఫోర్బ్స్ ఆసియాస్ హీరోస్ ఆఫ్ ఫిలాంత్రపీ’లో ఆయన స్థానం దక్కించుకున్నారు.
- పైకి ఆంక్షల కొరడా.. లోన కొనుగోళ్ల వరద.. రష్యాపై పాశ్చాత్య దేశాల తీరిది!
రష్యాపై కోపం వెళ్లగక్కుతూనే భారీ స్థాయిలో వ్యాపారం చేస్తున్నాయి పాశ్చాత్య దేశాలు. అందులో ఐరోపాదే అగ్రభాగం. అమెరికా, ఐరోపా మిత్రదేశాలు పుతిన్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ.. రష్యాపై భారీ ఆంక్షలు విధించాయి. యుద్ధం ప్రారంభమై 10 నెలలు కావస్తున్న వేళ.. రష్యాపై ఆంక్షలు ప్రభావం చూపించాయా? వాణిజ్యం దెబ్బతిందా అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తోంది. దీని గురించి మరింత తెలుసుకుందాం.
- పెళ్లిపై తమన్నా క్లారిటీ అబ్బో ఆ విషయంలో మొదట బాగా కసి కసిగా ఉండేదట
హీరోయిన్ తమన్నా పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఆమె త్వరలోనే ఓ డాక్టర్‌ను లేదా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంతో పాటే తాను నటించిన కొత్త సినిమా గుర్తుందా శీతాకాలం చిత్ర విషయాలను తెలిపింది. ఇంకా హీరో సత్యదేవ్‌తో నటించడం ఎలా ఉందనే విషయం కూడా మాట్లాడింది. ఆ సంగతులు.