కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామంలో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జన్మస్థలమైన భట్లపెనుమర్రు గ్రామాన్ని ఎఫ్సీఐ ఆంధ్రప్రదేశ్ రీజియన్ జనరల్ మేనేజర్ అమరేశ్ కుమార్ సందర్శించారు. పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నాటి స్వాతంత్య్ర సమర యోధులను గుర్తు చేసుకుంటూ భారత ప్రభుత్వం తలపెట్టిన ఆజాదీ కా అమృత్మహోత్సవ భాగంలో ఆయన అక్కడికి వచ్చారు.
పింగళి వెంకయ్య స్వాతంత్రోద్యమ సేవలు భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం గ్రామంలోని చౌక ధరల దుకాణాలను సందర్శించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమరేశ్ కుమార్తో ఎఫ్సీఐ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. PCB: పీసీబీ పారదర్శకతలో 13వ స్థానంలో ఏపీ.. తొలి స్థానంలో తెలంగాణ