ETV Bharat / state

పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలకు మంత్రుల పిలుపు - ఏపీ తాజా వార్తలు

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/23-January-2022/14261073_emm.jpg

author img

By

Published : Jan 23, 2022, 2:38 PM IST

Updated : Jan 24, 2022, 2:55 AM IST

14:34 January 23

పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామన్న ఉద్యోగ సంఘ నేతలు

పీఆర్సీ పై సంప్రదింపులకు రావాల్సిందిగా ఉద్యోగ సంఘాల నాయకులను మంత్రుల కమిటీ ఆహ్వానించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చింది. ఉద్యోగులతో సంప్రదింపులకు, వారికి నచ్చజెప్పడానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మలతో ఇప్పటికే ప్రభుత్వం ఓ అనధికార కమిటీని ఏర్పాటు చేసింది. దిల్లీ పర్యటనలో మంత్రి బుగ్గన, సీఎస్‌ ఉన్నందున మిగిలిన ముగ్గురూ ఉద్యోగులతో సంప్రదింపులకు అందుబాటులో ఉంటామని ఉద్యోగ సంఘాలకు సమాచారం పంపారు. మరోవైపు పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘ నేతలు తేల్చి చెప్పారు.

కొత్త పీఆర్సీపై కసరత్తు..!

మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన కొత్త స్కేళ్లతోనే జనవరి నెల జీతాలు సకాలంలో చెల్లించాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఖజానా శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆర్థికశాఖ అధికారులు మార్గదర్శకాలతో శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు ఇప్పటికే ఖజానా ఉద్యోగుల సర్వీసు అసోసియేషన్‌ తాము ఈ ప్రక్రియలో పాల్గొనబోమని ప్రభుత్వానికి తెలిపింది. ఆ సంఘం నాయకులు పి.శోభన్‌బాబు, రవికుమార్‌ ఉన్నతాధికారులకు ఈ సమాచారం ఇచ్చారు. తాజాగా పే అండ్‌ అకౌంట్సు ఉద్యోగుల సంఘం నాయకులు ఎం.వెంకటేశ్వరరెడ్డి, పి.శివప్రసాద్‌ కూడా ఉన్నతాధికారులను కలిసి తాము పీఆర్సీ అమలు ప్రక్రియలో పాల్గొనబోమని తేల్చిచెప్పారు.
ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ రెండ్రోజుల కిందట వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఏపీ సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవో రవి సుభాష్‌, ఖజానా శాఖ డైరెక్టర్‌ మోహన్‌రావు, పే అండ్‌ అకౌంట్సు అధికారి కె.పద్మజ, జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస పూజారి, జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, సహాయ ఖజానా అధికారులు, ఉప ఖజానా అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఖజానా శాఖ నిత్యం ఏమేం చేయాలనే దానిపైనా రావత్‌ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ప్రకారం...

* ఖజానా శాఖ డైరెక్టర్‌ మోహన్‌రావు డీడీలతో, ఎస్‌టీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పీఆర్సీ ఎలా అమలు చేయాలో వివరించాలి.

* అనంతరం ఖజానా శాఖ అధికారులందరూ సంబంధిత డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంట్‌ అధికారులతో సమావేశమై అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వాలి.

* ఖజానా శాఖ అధికారులంతా జనవరి 22కల్లా పరిశీలన కార్యక్రమం పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా అడుగు ముందుకు పడ్డ దాఖలాలు లేవు.

* రోజూ జిల్లా ఖజానా అధికారులు ఉదయం 11 గంటలకల్లా ఖజానా శాఖ డైరెక్టర్‌కు పురోగతి వివరించాలి. ఆయన మధ్యాహ్నం 12 గంటల లోపు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పురోగతి తెలియజేయాలి.

* సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవో అవసరమైన సాంకేతిక సహకారం అందించాలి. ఖజానా శాఖ అధికారులందరికీ డీడీవో వారీగా డ్యాష్‌బోర్డులో సమాచారం అందుబాటులో ఉంచాలి.

* ఖజానా అధికారులంతా ప్రభుత్వ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలి.

* జనవరి 25 కల్లా అందరు డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంటు అధికారులకు తాజా పే రోల్స్‌ అందుబాటులో ఉంచాలి. ఇంతకుముందున్న విధానం ప్రకారమే వాటిని ఖజానా అధికారులకు పే అండ్‌ అకౌంట్సు అధికారులకు వారు సమర్పించి జీతాల చెల్లింపు పూర్తిచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

crime: పట్టపగలే యువకుడిపై కత్తితో దాడి...పరిస్థి

FRAUD: చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరుతో రూ.20 కోట్లు బురిడీ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 24, 2022, 2:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.