ETV Bharat / state

'న్యాయవాదులకు శిక్షణ అకాడమీ ఏర్పాటు చేయాలి'

author img

By

Published : Nov 25, 2019, 5:27 AM IST

న్యాయవాదులకు శిక్షణ ఇచ్చేందుకు అడ్వొకేట్స్ అకాడమీ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ న్యాయవాదుల మండలి ఆలోచించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి పేర్కొన్నారు. అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు అవసరం అవుతాయన్నారు. అకాడమీ నిర్వహణలో ఉన్నత న్యాయస్థానం సైతం తమ వంతు సహకారం అందిస్తుందన్నారు. హైకోర్టు జడ్జిలతో న్యాయవాదులకు శిక్షణ ఇప్పిస్తామన్నారు.

'న్యాయవాదులకు శిక్షణ అకాడమీ ఏర్పాటు చేయాలి'
అడ్వొకేట్స్​ అకాడమీ ఏర్పాటు అవసరమన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి

ఏపీ న్యాయవాదులకు శిక్షణ అవసరమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ జే కే మహేశ్వరి అభిప్రాయపడ్డారు. ప్రధానంగా జూనియర్ న్యాయవాదులకు శిక్షణ ఇచ్చేందుకు అకాడమీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం, బార్​ కౌన్సిల్​ చొరవ చూపాలని అన్నారు. హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఏపీ బార్​ కౌన్సిల్​ వెబ్​సైట్(www.barcouncilap. org) మొబైల్​ యాప్​ను ప్రారంభించారు. ప్రతి హైకోర్టులో అడ్వకేట్స్​ అకాడమీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్​లో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ న్యాయవాదులు ముందుకు రాక ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు.

వెబ్​సైట్​ పనితీరు అద్భుతం

ఏపీ బార్​ కౌన్సిల్​ వెబ్​సైట్​ పనితీరు అద్భుతంగా ఉందని జస్టిస్​ జేకే మహేశ్వరి అన్నారు. ఎప్పటికప్పుడు వివరాల్ని పొందుపరచడం ద్వారా న్యాయవాదులకు, ప్రజలకు బార్​ కౌన్సిల్​ కార్యకలాపాల గురించి తెలుస్తుందన్నారు.

అకాడమీ ఏర్పాటుకు సీఎంకు నివేదించాం

అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల స్థలం కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి సమర్పించామని బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు అన్నారు. ప్రభుత్వం స్థలం కేటాయించిన మూడు నెలల్లో సీజే చేతుల మీదుగా అడ్వకేట్స్ అకాడమీకి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి తమకు ఆర్థిక సహాయం అవసరం లేదన్నారు. న్యాయవాద వృత్తిలో చురుకైన పాత్ర పోషిస్తున్న 31 వేల మంది న్యాయవాదుల సహకారంతో అకాడమీ భవనం నిర్మిస్తామన్నారు.

ఇదీ చూడండి:

'రేపటి నుంచి కోన రఘుపతి 'రెడ్డి' అని పిలవండి'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.