ap govt circular on PRC Gos: పీఆర్సీ జీవోల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొత్త జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నా ముందడుగే వేస్తోంది. ఓ వైపు చర్చలకు రావాలని చెబుతూనే తన పని తాను చేసుకుపోతోంది. తాజాగా జీతాలు,పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలని స్పష్టం చేసింది. జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేసే విధానాన్ని వివరిస్తూ ట్రెజరీ అధికారులకు, డీడీఓలను మరోసారి సర్క్యూలర్ జారీ చేసింది. ఓ వైపు పీఆర్సీ సాధన కమిటీతో ప్రభుత్వం చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఆర్థికశాఖ సర్క్యూలర్ జారీ చేయడం గమనార్హం.
జోవోలు రద్దు చేస్తేన చర్చలు...
AP Employees Strike: మరోవైపు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. జీవోలు రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ ఎన్జీవో హోంలో పీఆర్సీ సాధన సమితి నేతలు భేటీ అయిన నేతలు మంత్రుల కమిటీ ఆహ్వానంపై చర్చలకు వెళ్లాలా లేదా అన్న అంశంపై స్టీరింగ్ కమిటీ నేతలు చర్చించారు. అనంతరం మీడియాతో ఉద్యోగ సంఘ నేతలు మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వాన్ని నమ్మి తాము చాలాసార్లు చర్చలు జరిపామని బొప్పరాజు అన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఉద్యమాన్ని చేయించారని గుర్తు చేశారు. ప్రభుత్వం చెప్పిందొకటి.. చేసింది మరొకటని విమర్శించారు. మాలో ఎన్ని ఉన్నా.. ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయని స్పష్టం చేశారు. నిరసన వ్యక్తం చేస్తుంటే శత్రువులు మాదిరిగా చూస్తున్నారని అన్నారు. 27 శాతం ఐఆర్ ప్రకటించి.. 23 శాతానికి చేస్తే.. తగ్గించినట్లు కాదా? అని ప్రశ్నించారు. న్యాయబద్ధమైన పోరాటమని ప్రజలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. జీవోలన్నీ విడుదల చేశాక మంత్రుల కమిటీ వేస్తారా? అని ప్రభుత్వాని నిలదీశారు. తమ ఉద్యమానికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు.
తీవ్రంగా నష్టపోతాం - వెంకట్రామిరెడ్డి
"ఉమ్మడి నిరసనలో ఇప్పటివరకు నేను పాల్గొనలేదు. పీఆర్సీతో మొదటిసారి జీతం తగ్గే పరిస్థితి వచ్చింది.ప్రభుత్వం పునఃసమీక్ష చేసేలా ఒత్తిడి తీసుకురావాలి. మునిగినా తేలినా సరే అనుకుని సమ్మెకు నిర్ణయం. ఉద్యోగుల కడుపు మండేలా జీవోలు తయారుచేశారు. ఇప్పుడు పోరాడకపోతే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. ఆత్మగౌరవం కోసం ఉద్యమంలోకి వచ్చి పోరాడుతున్నాం" - వెంకట్రామిరెడ్డి
ఇదీ చదవండి : Marijuana gang : విశాఖలో గంజాయి ముఠా బీభత్సం..కారును వదిలి, చెరువులోకి దూకి..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం